నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 14, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని ఎక్లాసుపూర్ గ్రామంలో పట్వారి రాములు ప్రథమ వర్ధంతిలో భాగంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది.హైదరాబాదులోని మలక్ పేట యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రాణి క్లినిక్ హైదరాబాద్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ బిపి, షుగర్, ఈసీజీ లాంటి పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేయడమే కాకుండా టాబ్లెట్లు, మందులు పంపిణీ చేశారు. ఆ సందర్భంగా పట్వారి రాములు గ్రామ ప్రజలకు, ఆత్మకూర్ తాలూకాలోని ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన పేద ప్రజల భూముల సమస్యలను, రెవిన్యూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంలో పెత్తందారులకు వ్యతిరేకంగా నిలబడిన విషయాన్ని కూడా అందరు గుర్తు చేసుకున్నారు. ఈ మెడికల్ క్యాంపు పట్వారి రాములు కొడుకు డాక్టర్ సుధాకర్ బండారి, ప్రాణీ క్లినిక్ హైదరాబాద్ గారి చొరవతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ గజిటెడ్ హెడ్ మాస్టర్ ఎం సుదర్శన్, ఎం వెంకట్ రాములు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

