Tuesday, March 17, 2026

ఐకెపి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి-రైతు సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేత

నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలో ఐకెపి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి, ధాన్యం కొనుగోలు చేయాలనిరైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ నరహరి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షులు మాలోత్ వినోద్ మాట్లాడుతూ, మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అక్కడ వచ్చిన రైతులకు కనీస అవసరాలు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, తాగునీరు, కరెంటు, అకాల వర్షాలకు ధాన్యం పై కప్పే పట్టాలు సరిపడలేక అదేవిధంగా మార్కెట్ యార్డ్ మొత్తం కూడా కంప చెట్ల, పిచ్చి మొక్కలు, రాళ్లు రప్పలతో రైతులకు ధాన్యం ఎక్కడ పోసుకోవాలో తెలవక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటాలు వేసిన ధాన్యానికి రావలసిన అమౌంట్ తో పాటు బోనస్ ను కలిపి కూడా వెంటనే వచ్చే విధంగా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వసతులు సరిగా లేకపోవడం వలన రైతులు మిల్లర్స్ వద్దకు వెళ్తే మిల్లర్స్ వారందరూ సిండికేట్ ఉండి నిన్న ఒక్కరోజే రూ. 150 నుంచి రూ.200 లు తగ్గించడం జరిగిందని అన్నారు. కాబట్టి ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే మిల్లర్స్ మరియు సహకార కేంద్రాల వారితో మాట్లాడి, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. లేని పక్షంలో రైతులందరి సమీకరించి పెద్ద ఎత్తున సమరసిల పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, దయానంద్, ఖాజా మొహిద్దిన్, సుభాని తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News