Saturday, March 14, 2026

*ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు**

నేటి సాక్షి, కోరుట్ల టౌన్* (గణేష్ గొల్లపల్లి)కోరుట్ల మండలంలోని అయిలాపూర్, సంగెం, నాగులపేట్, వెంకటాపూర్, గుమ్లాపూర్, మోహనరావు పేట్, చిన్న మెట్టుపల్లి, మాదాపూర్, ధర్మారం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల DRDO రఘువరన్ మరియు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడిన పన్నాల అంజిరెడ్డి ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని రైతులు సద్వినియోగం చేసుకొని, కనీస మద్దతు ధర పొందాలని, దళారులని నమ్మి మోసపోవద్దని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఏవో నాగమణి, ఐకేపీ ఏపీఎం సమత, ఏఎంసీ వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్,జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్,జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఏలేటి శశింధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొల్లె నర్సయ్య, దోడ బాపురెడ్డి ,పడాల కవిత లచ్చయ్య, జక్కుల రాజం, పోతుగంటి వెంక గౌడ్,మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణా రెడ్డి, గుగ్గిళ్ల సురేష్ గౌడ్, రంజిత్ రెడ్డి, రకేష్ రెడ్డి,జనార్దన్, సుభాష్ రెడ్డి, నవీన్ రెడ్డి, వెంకటి, గంగ నర్సయ్య, అశోక్, మండల కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News