Thursday, March 19, 2026

ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు..ప్రశ్నించే వారిపై కేసులు బనాయించడమే లక్ష్యంగా నాయనా కొడుకు పనిచేస్తున్నారని గుడివాడ అమర్ నాథ్ ఫైర్..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 15 ~అన్నమయ్య జిల్లా :-: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్ నాథ్ మరో సారి విరుచుకుపడ్డారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై కేసులు బనాయించడమే లక్ష్యంగా నాయనా కొడుకు పనిచేస్తున్నారని గుడివాడ అమరనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని చేపట్టిన 18 నెలలుగా అప్పులు చేయడం పని పాటుగా పెట్టుకుంటూ తండ్రీ కొడుకులు గొప్పలు చెప్పుకోవడమే మిగిలాయని గుడివాడ అమరనాథ్ ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అమరనాథ్ ‘పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం పెట్టుబడులను ప్రోత్సాహించడం సహజమే నన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టాబేడుతున్నారని ఆ కంపెనీల్లో సత్వ అనేది ఒకటని సత్త్వ కంపెనీకి 30 ఎకరాలు రిషికొండలో ఇచ్చారని మార్కెట్ విలువ రూ. 40 కోట్లు ఎకరా ఉంటుందని మొత్తం 30 ఎకరాలు రూ. 45 కోట్లకే ప్రభుత్వం కేటాయించిందని సత్త్వ ఉద్యోగాలు ఇవ్వదని ఇది ఒక అద్దెలకు ఇచ్చుకునే సంస్థనని భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టాలని ఇప్పటి వరకూ డబ్బులు సత్త్వ కంపెనీ కట్టలేదని డబ్బులు కట్టడానికి గడువు పెంచుతూ జిఓ ఇచ్చారని వడ్డీ కూడా లేకుండా చేశారని రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి 45 కోట్లకు కొట్టేసి ఆ డబ్బులు కూడా కట్టడం లేదని సత్త్వ వెనక సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఆ సంస్థ చేసే నిర్మానాలకు 50 శాతం మళ్ళీ ఇన్సెంటివ్ ఇస్తున్నారని దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా అంటూ గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. 50% భూమిలో గృహ నిర్మానాలు చేసుకోడానికి అనుమతి ఇచ్చారని ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. సత్త్వ అన్ని రాష్ట్రల్లో వేలంలో భూములు కొనుక్కుందని స్పష్టం చేశారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News