జగిత్యాల జిల్లా మాత శిశు సంక్షేమాశాఖాధికారి నరేష్
నేటిసాక్షి, రాయికల్ :
ప్రతి గ్రామంలోని ఐదేళ్ల లోపు పిల్లలంతా ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉండి చదువుకోవాలని జిల్లా మాత శిశు సంక్షేమాధికారి నరేష్ సూచించారు. రాయికల్ మండలం కుమ్మరిపెల్లి, రాయికల్ పట్టణంలోని రెండవ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాయికల్ అంగన్వాడీ కేంద్రంలో ఫ్రీ స్కూల్ నమోదును మరింత పెంచాలని కోరారు.ప్రైవేటు స్కూల్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మమత, సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్లు, రమాదేవి, పద్మ, సుమలత,, వనిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 10 RKL02: అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సామర్థ్యాలను పరిశీలిస్తున్న దృశ్యం

