Wednesday, January 21, 2026

ఐపీఎస్ అధికారులకు బాగానే ఇచ్చి పడేసాడు.!ఐఏఎస్ అధికారుల‌పై టీడీపీ నేత దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం..రాజకీయ, అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, అన్నమయ్య జిల్లా :-: ఏపీలోని ఐఏఎస్ అధికారుల పనితీరుపై మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఏపీ సీడ్‌ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఐఏఎస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు వ్యవస్థకు పట్టిన శని గ్రహణంలా అభివర్ణిస్తూ దరిద్రంలా తయారయ్యారని ఘాటుగా విమర్శించారు. ఐఏఎస్ అధికారుల‌పై టీడీపీ నేత దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనాలే సృష్టిస్తుందని వివిధ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. దొంగలు, దరిద్రం చుట్టుకున్నట్టు చుట్టుకున్నారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్య‌లు ఐపీఎస్ అధికారులను ఎక్కడో తాకినట్టు ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఏమీ రోగం నీతులు మాట్లాడుతారు. డ్రామాలు ఆడుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఐపీఎస్ అధికారులకు బాగా తగిలేటట్టు ఉందని వివిధ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న తనకు గత 14 నెలలుగా జీతం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫైనాన్స్‌ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా ఫైల్ క్లియర్ చేయడం లేదని మండిపడ్డారు. “14 నెలలైనా ఒక చిన్న ఫైల్ క్లియర్ చేయలేని వారికి అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా?” అని నిలదీశారు. మెజార్టీ ఐఏఎస్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని దీపక్ రెడ్డి ఆరోపించారు. కేవలం డబ్బు కోసమే ఫైళ్లను ఆపేస్తూ, పాలనను బాటిల్‌నెక్‌ గా మారుస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఆయన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. “ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తన కూతురి పెళ్లికి రూ.1000 కోట్ల కట్నం ఇస్తానని స్వయంగా నాతోనే చెప్పారు. ఇలాంటి దొంగలు వ్యవస్థలో చాలా మంది ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన కలెక్టర్లు, ఐఏఎస్‌లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న దీపక్ రెడ్డి సొంత ప్రభుత్వ అధికారులపైనే ఈ స్థాయి విమర్శలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News