Saturday, March 7, 2026

*ఐసిఆర్పి సుమిత్ర గారి కుటుంబాన్ని ఆదుకోవాలి.ఎక్స్ గ్రేసీయో 5లక్షలు చెల్లించాలి…ఎం.రమేష్ బాబు,ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్*నేటి సాక్షి

07 ఫిబ్రవరి నంద్యాల :–నంద్యాల జిల్లా , సంజామల మండలం, రెడ్డిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనీటి నాచురల్ ఫామ్ లో ICRPగా అనేక సంవత్సరాలనుండి విధులు నిర్వహిస్తున్న సుమిత్ర గారు అకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరమని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సుమిత్ర గారి కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్రము లో ఏపీసీఎఎన్ఏఫ్ లో పని చేస్తున్న అన్ని రకాల క్యాడర్ సిబ్బందికి ఎక్స్ప్రెగ్రేసీయ్ , హెల్త్ కార్డు, పి ఎఫ్, ఈఏస్ఐ సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయం ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ బాబు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామద్దయ్య, రామాంజి లు ఒక ప్రకటన లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రం లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాచురల్ ఫామ్ ను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పం చేస్తుందని అయితే అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదని ప్రమాదం జరిగితే హెల్త్ కార్డు,ఎక్స్గ్రేగ్రేషియ లేని దుర్భర మైన పరిస్థితి ఉందన్నారు. అనేకమంది ఎన్నో ప్రమాదాల్లో మరణించిన వారికి ఏమాత్రం ప్రభుత్వం సాయం చేయడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వీరికి మాత్రం ఎలాంటి హెల్త్ కార్డు లేదన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించకపోవడం చాలా దారుణం అన్నారు. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు.ఈ విషయంపై రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.సుమిత్ర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నామన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News