నేటి సాక్షి ప్రతినిధి, (చీరాల)జూలై 07
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం గడిచిన ఏడాది పాలనలో ప్రజలకి చేసిన పరిపాలన భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన సూపరిపాలన లో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల నియోజవర్గం చీరాల పట్టణంలోని 1 వ వార్దు రామనగర్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తేలుసుకొని, అదేవిధంగా ఇంకా ప్రజలు ఏమైనా సమస్యలను బాధపడుతుంటే ఆ సమస్యలు తక్షణమై పరిష్కారించాలని అధికారులకు అదేశాలు చేశారు.ఈ సందర్బంగా ఏమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అర్దికసంక్షోభంలోకి నెట్టివేశాడని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సియం చంద్రబాబు సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం , ప్రజలకు సమస్యలు లేకుండా చేయడమే కుటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.