Wednesday, March 18, 2026

*ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తల్లి–కుమారుడు*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)కమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలలో హృదయపూర్వక ఘనసన్మానం*రామచంద్రపురం* మండలంలోనికమ్మపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హృదయాన్ని హత్తుకునే అరుదైన ఘట్టం.ఇదే పాఠశాలలో తల్లి–కుమారుడు ఇద్దరూ ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న నేపథ్యంలో వారికి ప్రత్యేక సన్మానం నిర్వహించారు.ఎస్.జె.కామేశ్వరి, డీఎస్సీ 2008లో ఎంపికై పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం)గా ప్రతిష్టాత్మక సేవ కొనసాగిస్తున్నారు.ఇటీవల మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఆమె కుమారుడుఎం.ఎన్ భరద్వాజా, స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా ఇదే పాఠశాలలో చేరడంతో పాఠశాల వాతావరణం ఆనందభరితమైంది.ఈ విశేష సందర్భం పురస్కరించుకొని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ డైరెక్టర్ చిన బాబు పాఠశాలకు విచ్చేసి, తల్లి–కొడుకుల ఇద్దరి సేవాభావాన్ని గుర్తించి శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కుటుంబ వారసత్వం కొనసాగడం సమాజానికి ఆదర్శమని ఆయన అభినందించారు.ఒకే పాఠశాలలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేయడం చాలా అరుదు. ఈ కుటుంబం విద్యాసేవకు నిలువెత్తు నిదర్శనం అని ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు సభాపతి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ నాయిక్ ,జయశ్రీ,హిమ బిందు,శోభ రాణి,విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News