- అన్ని కంపెనీల పత్తి విత్తనాలు సాగు చేయాలి
- సాగులో యాజమాన్య పద్ధతులు పాటించేలా చూడాలి
- రైతులు అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలి
- వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించాలి
- వ్యవసాయ అధికారులతో సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతి
నేటి సాక్షి, కరీంనగర్: రైతులు ఒకే రకం కంపెనీ పత్తి విత్తనాలను తరచూ వాడకుండా, వివిధ రకాల కంపెనీల విత్తనాలను వాడాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పంటల సాగులో యాజమాన్య పద్ధతులు అవలంబించడంతో అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువుల సరఫరాపై వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాల సరఫరాను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 48 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చావు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు లక్ష ఇరవై వేల పత్తి ప్యాకెట్లు అవసరమవు తాయని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా లక్ష 30 వేల పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువు ఎంత దోహదపడుతుందని తెలిపారు. గత సీజన్లో 10 వేల ఎకరాలకు సరిపడా పచ్చి రొట్ట విత్తనాలను పంపిణీ చేశామని చెప్పారు. ఈ సీజన్లో 11250 ఎకరాలకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 75 శాతం విత్తనాలను 40 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశామని తెలిపారు. మిగతా 25 శాతం విత్తనాలను రెండు రోజుల్లో అందజేస్తామని పేర్కొన్నారు. విత్తనాలు విక్రయించే షాపుల్లో వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించా లని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తనిఖీల సందర్భంగా రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాలని, విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏదైనా అనుమానం ఉంటే విచారణ జరపాలని సూచించారు. తనిఖీలు చేసే సమయంలో వీడియోలు తీసి వాటిని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రసారమయ్యేలా వ్యవసాయ అధికారులు చూడాలని పేర్కొన్నారు. జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు. పంటల సాగులో రైతులకు నిరంతరం వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు అధిక దిబడులు సాధించి ఆర్థిక అభివృద్ధి చెందేలా నిరంతరం ప్రోత్సహించా లని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్ ఏడీఏలు రణధీర్ రెడ్డి, రామారావు, సునీత, జిల్లాలోని వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.