-నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన రోజు ముక్కోటి ఏకాదశిగా పిలవబడుతోందని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మదనపల్లె లోని పలు ఆలయాలలో భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామున నుండి ఆలయాల్లో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున భక్తాదులు పోటెత్తారు. పలు ఆలయాల్లో దైవనామ స్మరణతో మారుమోగింది. కుల మతాలకతీతంగా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తన భక్తిని చాటారు. అచ్చం హిందువుల నుదుటన తిలకం పెట్టుకొని చూపురులను ఆకర్షించారు. మంగళవారం వేకువజామున నిస్సార్ అహ్మద్ అనుచరులతో కలిసి అమ్మచెరువుమిట్ట వద్దనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార గుండా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్దానిక వైసీపీ నాయకులు నిస్సార్ అహ్మద్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉత్తర గూండా వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వివిధ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులచే ఆశీర్వచనం స్వీకరించి తీర్ధప్రసాదాలను స్వీకరించారు. ముక్కోటి దేవతల దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని నిస్సార్ అహ్మద్ వేడుకున్నారు. అనంతరం భక్తులకు ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి విశేషమైన విశిష్టత ఉందన్నారు. ఉత్తర ద్వార దర్శనం గూండా వెళ్లి దర్శించుకుంటే కోటి పుణ్యాలు దక్కుతుందన్నారు. ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన రోజని దాన్నే హిందువులు ముక్కోటి ఏకాదశిగా పిల్చుకుంటారని నిస్సార్ అహ్మద్ వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడనే ప్రతీతి అని చెప్పుకొచ్చారు. మహా భారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉందన్నారు. హిందూ పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పుణ్యం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారని అన్నారు. పలు కార్యక్రమాల్లో నిస్సార్ అహ్మద్ తోపాటు ఎస్.రమేష్, దండు రామాంజులు, కృష్ణారెడ్డి, రామమోహన్, మధు, కౌన్సిలర్లు శివ, ఈశ్వర్ నాయక్, పూజారి చరణ్, శ్రీకాంత్, మల్లికార్జున రెడ్డి, మహేష్ కొత్తపల్లె, యూనస్, సాదిక్, యాసిన్, సమద్, పురాణం వెంకట్రమణ, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~

