Wednesday, February 11, 2026

ఓటు హక్కు రేపటి భవిష్యత్తుకు దిక్సూచి-ఓటు హక్కు వినియోగించుకున్న : అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగ్ కోటయ్య

నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా రేపటి భవితకు పునాది వేసుకోవచ్చని చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగ్ కోటయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపాలిటీలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాచరిక వ్యవస్థలో మాదిరి కాకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశాన్ని డా. బిఆర్ అంబేద్కర్ లికించిన భారత రాజ్యాంగం మనకి ఈ హక్కును కల్పించిందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News