Saturday, March 21, 2026

*ఓటేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ డే**విద్యార్థులకు బహుమతులు ప్రధానం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి రూరల్*తిరుపతి రూరల్ ఓటేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు.బడివైపు ఒక అడుగు-తల్లిదండ్రులతో 3.0 మెగా పేరెంట్స్ సమావేశంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మన పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆనందంగా గడుపుతూ విద్యను క్రమశిక్షణతో అభ్యసించేలా విద్యాబోధన చేస్తున్నామని చెప్పారు.విద్యార్థుల విద్యా వికాసము , తరగతి విద్యార్థులలో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, జ్ఞానాభిలాషను పెంపొందించుకోవాలని ప్రస్తుత మారుతున్న కాలంతో పాటు అన్ని రంగాలలో వారి అభివృద్ధిని పెంపొందించాలని ఆమె సూచించారు.అలాగే ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇది సదకాశము,పిల్లలు తల్లిదండ్రులతో పట్ల ఎలా మెలగాలి, పెద్దలతో ఎలా వ్యవహరించాలో పాఠశాల స్థాయి నుండి అలవరచుకునేలా బోధిస్తున్నామని చెప్పారు.తల్లిదండ్రులు గర్వపడేలా చదువులో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉండాలని ప్రతి ఒక్క పిల్లలకు మేము తెలియజేస్తున్నామన్నారు.ప్రతి తరగతిలోను హాజరులో, మార్కుల ఆధారంగా మెరిట్ స్టూడెంట్స్ కు బహుమతులు ప్రధానం చేయడం జరిగిందని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ మెంబర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇస్మాయిల్ భాయ్, మోహన్, రంగయ్య, సుదర్శన్, మణికంఠ విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొని విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా స్థానిక నాయకులు సూర్యకిరణ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేసారు, స్థానికంగా వున్న సమస్యల గురించి చర్చించడం జరిగిందని తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News