Monday, January 19, 2026

*ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎస్ఐ పి.తిరుపాలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.వెంకటస్వామి, రిటైర్డ్ పిడి శివలక్ష్మి రెడ్డి*

నేటి సాక్షి 19 పాములపాడు:-మండల కేంద్రమైన పాములపాడులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ & నందికొట్కూరు నియోజవర్గ టిడిపి యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం 52 టీములు ఉత్సాహంగా పాల్గొనీ విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాములపాడు ఎస్సై- పి.తిరుపాలు, రిటైర్డ్ ఎంప్లాయిమెంట్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ కె.వెంకటస్వామి, రిటైర్డ్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ శివలక్ష్మి రెడ్డి, శ్రీ వివేకానంద విద్యావిహర్ హైస్కూల్ కారస్పాండెంట్ ఆర్ఎస్ఆర్.గోపాల్, మమత క్లినిక్ డాక్టర్ ఎం.రాజు, వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ ఓనర్ నాగరాజు, ఎస్.పి.ఎల్.వి. కన్స్ట్రక్షన్స్ ఓనర్ రంజిత్, ప్రిన్స్ టైలర్ లింగారెడ్డి, డిష్ రామచంద్ర, గాండ్ల సురేష్, భీమవరం వెంకటరమణ, తదితరులు హాజరై, గెలుపొందిన టీములకు నగదు బహుమతులు మరియు ట్రోఫీలను అందజేశారు.ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి – బ్రాహ్మణుకొట్కూరు టీం 30,000/- & ట్రోఫీ, రెండో బహుమతి – జాక్ స్పారో టీం 20,000/- & ట్రోఫీ, మూడవ బహుమతి – పారుమంచాల టీం 10,000/- & ట్రోఫీ, నాలుగవ బహుమతి – పాములపాడు టీం 5,000/- & ట్రోఫీ అందుకున్నారు.గ్రామీణ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్‌ను పాములపాడు ఆర్గనైజర్లు తొమ్మిది రోజుల పాటు క్రమశిక్షణతో, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాములపాడు క్రికెట్ సీనియర్ క్రీడాకారులు రసూల్, హనుమంతరావు బషీర్ ,ఇస్మాయిల్,శాంతన్న, శంకరయ్య, ఇజ్రాయిల్, రామాచారి, దక్షిణామూర్తి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News