నేటి సాక్షి,నారాయణపేట జనవరి 31,( రిపోర్టర్ ఇమామ్ సాబ్),మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను శనివారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కే .సీతాలక్ష్మీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కంట్రోల్ రూమ్ యొక్క పనితీరును పరిశీలించారు. సంబంధిత అధికారులు తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధికారులకు అందించాలని అన్నారు. కంట్రోల్ రూమ్ కి ఇప్పటి వరకు ఏమైనా ఫిర్యాదుల వచ్చాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి సాయిబాబా, డి పి.ఆర్.ఓ.రషీద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





