నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తల్లిని కోల్పోయి విషాదంలో మునిగి ఉన్న కందారపు మురళి కుటుంబాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ ఆదివారం నాటి సాయంత్రం పరామర్శించారు.
స్థానిక యశోదా నగర్ లోని కందారపు మురళి సోదరుడు కందారపు మోహన్ ఇంట్లో సుద్దాల అశోక్ తేజ కందారపు రాజమ్మ కుమారులను, కుమార్తెలు రమాదేవి, విజయలక్ష్మి, కోడళ్ళు అవనిగడ్డ పద్మజ, సుజాత అల్లుళ్ళు మల్లికార్జున రావు, ఓం ప్రకాష్ తదితరులను పరామర్శించారు. మరణానంతరం రాజమ్మ కళ్ళు దానం చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. కందారపు రాజమ్మ నిండు జీవితాన్ని పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారని, సమాజానికి హితం చేసే బిడ్డలను కన్నారని, అమ్మ గురించి ఓ కవితను వినిపించారు.
డాక్టర్ సుద్దాల అశోక్ తేజ వెంట ఆయన శ్రీమతి సుద్దాల నిర్మల, ధర్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ రంగస్థల కళాకారులు ధర్మయ్య, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున తదితరులు ఉన్నారు.