Tuesday, January 20, 2026

కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలి.

విత్తనపత్తి రైతులపై జరుగుతున్న అక్రమాలు,దోపిడీలపై చర్యలు తీసుకోవాలి… రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డికి రైతులతో కలిసి వినతిపత్రం అందజేసిన… ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జోగులాంబ గద్వాల: జిల్లాలో తన పత్తి రైతులపై జరుగుతున్న అక్రమాలు మరియు దోపిడీలపై చర్యలు తీసుకోని రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ రైతులతో కలిసి వినతిపత్రం అందజేసి రైతుల సమస్యలను వివరించారు. *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….*జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 40వేల మంది రైతులు, 30వేల ఎకరాలకు పైగా, విత్తన పత్తిని సాగుచేస్తూ రాష్ట్రంలోనే గద్వాల ప్రాంతం విత్తన భాండాగారంగా ప్రసిద్ధి చెందిన కేంద్రమని అన్నారు. సుమారు 20 కు పైగా కంపెనీలు రైతులతో విత్తనపత్తిని సాగు చేయిస్తున్నాయి. అయితే సదరు కంపెనీలు ఫౌండేషన్ సీడు ను నేరుగా రైతులకు ఇచ్చి సాగు చేయించకుండా మధ్యవర్తులను (ఆర్గనైజర్లు) ను నియమించుకుని వారి ద్వారా రైతులతో విత్తనపత్తిని పండిస్తున్నాయని, ఈ క్రమంలోనే ఆర్గనైజర్లుగా పిలవబడే మధ్యవర్తులు రైతులను పలు రకాలుగా అన్యాయంగా దోపిడీకి గురి చేస్తూ పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్యాకెట్ పై ఇచ్చిన రేటు నుండి కమిషన్ పేరిట, తరుగుదల పేరిట, వడ్డీల రూపంగా, GOT (గ్రో అవుట్ టెస్ట్) పేరిట రైతులను దోపిడీకి గురి చేస్తూ,పంట కాలం కలుపుకొని సుమారు 16 నెలల వరకు రైతులకు విత్తనపత్తిపై అమౌంటు ఇవ్వకుండా అప్పటిదాకా పంటపై ఇచ్చిన అడ్వాన్స్ కు వడ్డీలను రైతుల నుండి ముక్కు పిండి వసూలు చేయడం అన్యాయమన్నారు.రైతులు ఆయా కంపెనీల ఫౌండేషన్ సీడ్ ను ఆర్గనైజర్ల ద్వారా తీసుకుని జూన్ మొదటి వారంలో పంటను వేస్తే సుమారు ఆరు నెలల తర్వాత డిసెంబర్లో చేతికి వచ్చిన పంటను నేరుగా కంపెనీలకు కాకుండా ఆర్గనైజర్ల చేతిలోకి అనగా సీడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అప్పచెబుతున్నారు.అక్కడ జిన్నింగ్ ప్రక్రియ నిర్వహించి కేజీ విత్తనాలను పాకెట్లు గా చేసి కంపెనీలకు పంపగా ఆయా కంపెనీలు GOT (గ్రో అవుట్ టెస్ట్) ప్రక్రియను నిర్వహించి GOT ఫలితాల్లో ఆయా కంపెనీల నిర్దేశిత ఉత్తీర్ణత శాతం ప్రకారం పాస్ అయినా రైతులకు పేమెంట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, వాస్తవానికి GOT పరీక్షను నిర్వహించడానికి సుమారు రెండు నెలల కంటే ఎక్కువ సమయం పట్టదు,కానీ ఆర్గనైజర్లు GOT ఫలితాలను వెల్లడించకుండా,వచ్చే పంటకాలం జూన్ వరకు అమౌంట్ ఇవ్వకుండా, అప్పటిదాకా పంటపై ఇచ్చిన అడ్వాన్స్ కు వడ్డీల రూపంలో వసూలు చేస్తూ రైతులను అనేక రకాలుగా దోపిడీ చేసి మోసానికి గురి చేస్తున్నారని తెలిపారు.రైతులను అనేక రకాలుగా ఇబ్బందుల గురిచేసి భూములను బలవంతంగా లాక్కొని వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుని దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కాన వెంటనే కంపెనీ మరియు ఆర్గనైజర్లు చేస్తున్న దోపిడీ మోసాలపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న,జిల్లా నాయకులు రంగస్వామి, ధరూర్,మల్దకల్,గట్టు మండలాల అధ్యక్షులు నెట్టెంపాడు గోవిందు,విష్ణు,బలరాం నాయుడు, మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్, నజుముల్లా, అడివి ఆంజనేయులు, మునెప్ప,దయాకర్, కార్యదర్శులు కృష్ణ,రాము, నాయకులు మీసాల కిస్టన్న,అవనిశ్రీ, చిన్న రాముడు, అమరెష్, గోపాల్,జమ్మన్న, భూపతి నాయుడు, రఘుపతి, వెంకటేష్, ఆశన్న, అంజి, కె.పి. రామకృష్ణ, సామియేల్, గజేంద్ర, వీరితో పాటుగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News