నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)కర్లపాలెం మండల పరిధిలోని యాజలి గ్రామంలో ఆకస్మికంగా మృతి చెందిన నాలుగో వార్డ్ మెంబర్ కట్టుపల్లి ఏసుమణిమ అత్త కట్టుపల్లి బుజ్జి మృతదేహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరాల వెంకట సురేష్ గాన నివాళులర్పించారు. బుజ్జమ్మ మృతికి గల కారణాలను ఆమె కుమారుడు సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యకర్తను కోల్పోయింది అన్నారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోన రఘుపతి బుజ్జమ్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు తెలిపారు. అనంతరం మృతురాలి కుమారుడు సుబ్బారావుకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొంతు కోలు ఏ కాబు, ఏపూరి ఏసుబాబు, బంగారయ్య, మాజీ సర్పంచ్ ఏపూరి పురుషోత్తం చౌదరి గాలిమార్క్ ఇసాక్ బొలిమేర శశి మద్దాల జాన్ గాలి గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.





