నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడం: రాసే పెన్ను తలలో దిగి, నాలుగేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాచలంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ఐదేండ్ల రియాన్షిక సోమవారం మంచంపై కూర్చొని రాసుకుంటున్నది. ఈ సమయంలో చిన్నారి ప్రమాదవశాత్తూ కింద పడగా, ఆమె తలలో పెన్ను దిగింది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఖమ్మం దవాఖానకు తరలించారు. వైద్యులు పెన్నును తొలగించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పాప అకాల మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.