Saturday, March 7, 2026

**కత్రం చారిటబుల్ వైద్య సేవలు ప్రశంసనీయం** *👉బేతవోలులో ఆర్థో వైద్య శిబిరం విజయవంతం**👉231 మందికి వైద్యసేవలు

* నేటి సాక్షి. “చిలుకూరు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ప్రత్యేక ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. బేతవోలు సర్పంచ్ నాగయ్య ఈ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో అన్నిదానాల్లోకి ఆరోగ్యదానమే మిన్న అన్నారు. సమాజంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నా అందరిలోనూ సేవగుణం ఉండదని, కానీ కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ రెడ్డి సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నతంగా ఎదిగినా మూలాలను మరువకుండా తన చుట్టూ ఉన్న వారికి సేవ చేయడం ప్రశంసనీయమన్నారు. సామాజిక బాధ్యతగా ప్రజారోగ్యం కోసం కత్రం శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ఆరోగ్యసేవలు అభినందనీయమన్నారు. ఆయన సేవలను మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ వైద్యశిబిరంలో మొత్తం 231మంది వైద్య సేవలు పొందారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. శిబిరానికి వచ్చినవారికి నిర్వాహకులు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ధో సర్జన్ డాక్టర్ పుట్టా వెంకటేష్, డాక్టర్ కావ్యశ్రీ, బేతవోలు సర్పంచ్ వట్టికూటి నాగయ్య. ఉప సర్పంచ్ ఏడుకొండలు, కత్రం చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు రామాంజనేయులు, కత్రం ఆరోగ్య సేవ కో-ఆర్డినేటర్ గౌతం రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News