నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )కథలాపూర్ మండలం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా సిహెచ్.రవి కిరణ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై రవి కిరణ్ మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఇదివరకు పని చేసిన ఎస్ఐ నవీన్ కుమార్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు.____

