నేటి సాక్షి ,నారాయణపేట, డిసెంబర్ 30, నారాయణ పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ప్రాచీన కట్టడాలైన గుండాలు ( సమాధుల కట్టడాలు) సంవత్సరానికి ఒకటిగా కనుమరుగు అవుతున్నాయని మరికల్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రాచీన కాలంలో సమాధుల గుండాలు తొలగించి ఇండ్ల నిర్మాణాలు కడుతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అధికారులు స్పందించి ఇట్టి గుండాల పరిశీలించాలని మరికల్ గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

