Tuesday, March 10, 2026

కన్నుల పండువగా శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర

హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన భీష్మ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 30,

శ్రీ శ్రీ హరేరామ హరికృష్ణ మందిరం ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలోని శ్రీ బాలాజీ దేవాలయం వద్ద సోమవారం శ్రీ పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా నిర్వహించారు. రథయాత్ర మహోత్సవానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగారు. రథయాత్ర మహోత్సవం సందర్భంగా రథయాత్ర జరుగుతున్న ప్రాంతాన్ని భక్తులతో కలిసి ఊడ్చి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావాన్ని నింపేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి,‌ గోపాల్ గౌడ్, హన్మంతు ముదిరాజ్, నర్సింహనాయుడు, మిస్కిన్ సంతోష్, నందుకుమార్, నాగురావు, చామకూర నగేష్, వై.సంతోష్, అశోక్, నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News