నేటి సాక్షి నారాయణపేట, మార్చు, 16 2026,,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కన్మనూర్ గ్రామంలో మద్యం సిట్టింగ్లు జోరుగా కొనసాగుతున్నాయి. కన్మనూరు గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పక్కనే ఈ మద్యం షాపు ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నారాయణపేట జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి కన్మనూరు గ్రామంలో గల మద్యం బెల్టు షాపును తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు





