నేటి సాక్షి, నారాయణపేట,జూన్ 17,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కన్మనూరు గ్రామంలో గత మూడు రోజుల కిందట మహిళపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ మండల పరిధిలోని కన్మనూరు గ్రామానికి చెందిన కలాలి మంజుల అనే మహిళ నిమ్మకాయలు వేసిందని అనుమానంతో దాడి చేసి తీవ్ర గాయాలు చేశారు. ఇట్టి విషయంపై మంజుల కుటుంబ సభ్యులు మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం తీవ్ర గాయాలైన మంజుల ను నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధితులు తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు బాధ్యత కుటుంబం వివరించారు. ఈ విషయమై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం మరికల్ ఎస్సై రాములు వివరణ ఇచ్చారు .