నేటి సాక్షి, నారాయణపేట జనవరి 18,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కన్మనూర్ గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వార్డులలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అంకిత సురేంద్ర గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వార్డులలో చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రత పాటించాలని ఆమె గ్రామస్తులను కోరారు. వార్డులు శుభ్రత ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని గ్రామస్తులు సహకరించాలని ఆమె కోరారు. ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కన్మనూరు గ్రామ వార్డు సభ్యులు రమేషు రాము సందీప్ గ్రామస్తులు గణేష్ రెడ్డి నర్సింలు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

