నేటి సాక్షి నారాయణపేట డిసెంబర్ 16,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కనుమనూరు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని కనుమనూరు గ్రామ సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ కన్మనూరు గ్రామంలోని ప్రతివాడు లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలోని ప్రతి వాళ్ళలో సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తాగునీటి సమస్య గాని తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. కనుమనూరు గ్రామ సర్పంచ్ గా తనకు అవకాశం ఇచ్చిన కన్మనూర్ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈ సమావేశంలో కనుమనూరు గ్రామ ఉపసర్పంచ్ రవి కుమార్ రెడ్డి, వార్డు సభ్యులు పి రవి , రామేశ్వరమ్మ హరికాంత్ రెడ్డి అనిత మల్లేష్ ఉమా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





