Thursday, March 12, 2026

కబడ్డీ పోటీలకు అక్షర విద్యార్థి ఎంపిక

నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్):* జగిత్యాల జిల్లాలో 69వ పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలుర కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో మండలం లోని అక్షర హైస్కూల్‌ విద్యార్థి గాలిపెల్లి నాని ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం వై.అనంత రెడ్డి, ఆశీరెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తున్నామని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమన్వయం, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. మండల స్థాయి కబడ్డీ జట్టులతో తలపడి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారని, జిల్లా స్థాయిలోనూ తమ విద్యార్థి రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేసి అభినందించారు. కాగా మంగళవారం పెద్దపల్లి జిల్లాలో జరిగే కబడ్డీ పోటీల్లో నాని పాల్గొననున్నట్లు పాఠశాల పీఈటీ ఎస్.వసంత తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News