Saturday, March 7, 2026

*కమణీయం… రమణీయం… శివ పార్వతుల కళ్యాణం…**లలితామాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు ముగింపు*—————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………జగిత్యాల రూరల్ మండలం పొలాసలో కొలువై ఉన్న 108 శ్రీచక్ర సహిత లలితామాత ఆలయంలో శుక్రవారం శివ పార్వతుల కల్యాణన్ని భక్తుల శివ నామస్మరణల మధ్య, వేద బ్రహ్మనోత్తములు అంగ రంగ వైభవంగా,శాస్త్రోక్తంగా నిర్వహించారు.బ్రహ్మశ్రీ తీగుళ్ల విషుశర్మ వైధిక నిర్వహణలో 108 శ్రీచక్ర సహిత లలితమాత ఆలయ 3 వ వార్షికోత్సవ వేడుకలను భక్తుల కోలాహలం మధ్య ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులూ మాధవ్, భరత్,అజయ్ శర్మ,రాకేష్ మీశ్రా, రాధాకృష్ణ తదితరులు కళ్యాణన్ని ఘనంగా నిర్వహించారు.కమణీయం… రమణీయం..అన్న చందంగా చూడ ముచ్చటగా శివపార్వతుల కళ్యానాన్ని వేద బ్రాహ్మణులూ జరిపారు.మొదటగా ఆలయంలో లలితా మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా సుహాసినిలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.మహిళలు లలితసాహస్ర నామ పారాయణం భక్తి, శ్రద్ధలతో చేశారు.అనంతరం శివపార్వతుల కళ్యాణం మంగళవాయిధ్యాల మధ్య జరిపించారని ఫౌండరి చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య తెలిపారు.ఆలయంలో ఉత్సవాలు శ్రీమాన్ నంబీ వేణుగోపాల చార్య కౌశిక మంగళశాషణమూలతో బ్రహ్మశ్రీ తీగుళ్ల విషు శర్మ వైధిక నిర్వహణలో శుక్రవారం ముగింపు కార్యక్రమాలు జరిగాయని 108 శ్రీ చక్ర సహిత లలితమాత ఆలయ ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప వివరించారు.ఈ కార్యక్రమంలో ఉటూరి కళ్యాణి, పాంపట్టి సులోచన, ఆది వనజ, పెద్ది అశ్విని, కటకం రమ, శిరీష, ఉటూరిఅర్చన,స్వప్న,మహేందర్,ఉజగిరి జమున,మహేష్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News