నేటి సాక్షి – ఇబ్రహీంపట్నం*( రాధారపు నర్సయ్య )ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని అతిపురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు హోలీకి మూడు రోజుల ముందు ప్రారంభమై అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం గ్రామస్తులు, దాతల సహకారంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.*యజ్ఞ పూర్ణాహుతి – వేదమంత్రోచ్ఛారణ మధ్య కళ్యాణం*ఖానాపూర్ వాస్తవ్యులు యజ్ఞ అర్చకులు చక్రపాణి అగమనరసింహమూర్తి చార్యులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూడు రోజులుగా లోకక్షేమార్థం జరుగుతున్న యజ్ఞాన్ని వేదమంత్రోచ్ఛారణ మధ్య పూర్ణాహుతితో ముగించారు. అనంతరం ఆలయంలో బలిహరణ కార్యక్రమం నిర్వహించి సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు కొనసాగించారు.*పల్లకి సేవ – పంచామృత అభిషేకాలు*యజ్ఞం అనంతరం స్వామివారిని ప్రత్యేక పల్లకిలో బాజా భజంత్రిల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి కళ్యాణ మండపంలో కొలువుదీర్చారు. అక్కడ పంచామృతాభిషేకం నిర్వహించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అలివేలు మంగమ్మ సమేతంగా శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. వేదమంత్రాల నాదంతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.*మహిళల ఒడి బియ్యం – భక్తుల ప్రత్యేక మెక్కులు*కళ్యాణం అనంతరం మహిళలు ఒడి బియ్యం సమర్పించి తమ భక్తిశ్రద్ధలను వ్యక్తం చేశారు. భక్తులు ప్రత్యేక మెక్కులు చెల్లించుకొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తరి రామానుజం, ఉపసర్పంచ్ బర్మ మల్లయ్య, యామపుర్ సహకార సంఘం మాజీ చైర్మన్ అంకతి రాజన్న, మాజీ సర్పంచ్ సున్నం నవ్యశ్రీ, మాజీ ఎంపిటిసిలు దేశేట్టి మమత, పెంట లక్ష్మీ, అర్చకులు మంత్రరాజం శ్రీనివాస్ చార్యులు, మంత్రరాజం జానకిరామకృష్ణ చార్యులు, మంత్రరాజం అరవింద్ కృష్ణ చార్యులు, సాముజి నవీన్ చార్యులు,అలాగే నాయకులు సున్నం సత్యం, పెంట లింబద్రి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల రమేష్, పోతరాజు శివరాజం, దేశేట్టి రాజరెడ్డి, గుజ్జె గంగాధర్, లోక సురేష్, అరె రమేష్, గుమ్మల నరేష్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుమ్మల గంగన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొబ్బాజి లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యక్షుడు రాధారపు రవి, కోశాధికారి అరె లింగారెడ్డి, రైటర్ రెడ్డవేన లక్ష్మీనర్సయ్యతో పాటు బస మల్లేశ్, కుమ్మరిపెల్లి నరేష్, నలిమెల రాజేందర్, వనతడుపుల శ్రీనివాస్, నాంపల్లి గణేష్, అకు రాజేశ్, మైలరపు గంగారాం, అల్లకోండ కిషన్, గుగ్లవత్ రాజేందర్, బర్కం రాజగంగారాం, అకు చిన్న రాజం, మంగ్లారపు వినోద్, సుద్దాల రెడ్డి తదితరులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు మహిళలు పాల్గొన్నారు.భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి._____





