Monday, March 16, 2026

*కమీషనర్ సార్..మీరు వాడే కారు వివరాలు కావాలి.!*—————-* మాకు అనుమానంగా ఉందంటూ.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న యువకుడు ———*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవిందర్ గౌడ్ వ్యవహారశైలీపై మాకు అనుమానంగా ఉంది..వివిధ అంశాలపై మేం ఎన్నిసార్లు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నా..’థర్డ్ పార్టీ’ అని..చేతులు దులిపేసుకునేలాంటి ‘మొక్కుబడి’ సమాధానాలు ఇస్తున్నరని..ఆయన వాడే ‘వెన్యూ వైట్ కలర్ కారు’ వివరాలు..అతని డ్రైవర్ గురించి కోరుట్లకు చెందిన ఒక యువకుడు ‘సమాచారు హక్కు చట్టం’ కింద మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు.ఈ వ్యవహారం పట్టణంలో చర్చానీయాంశమైంది.గత జూన్ నెల 27 నుంచి మీరు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి.. ప్రజావసరాల కోసం వాడుతున్న ‘వెన్యూ వైట్ కలర్ కారు’కు సంబంధించిన వివరాలు కావాలని కోరుట్ల పట్టణానికి చెందిన కట్కం.చంద్రశేఖర్ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు.ఆయన వాడుతున్న కారు ప్రభుత్వ వాహనమా.? మీ స్వంత వాహనమా.? లేక కాంట్రాక్టు వాహనమా.? ఆ కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్..దాని యజమాని వివరాలు కావాలని ఆ దరఖాస్తులో కోరారు. అలాగే.. మీరు వాడుతున్న కారు డ్రైవర్ సానిటరీ వర్కరా.? లేక కాంట్రాక్టు టెండర్ కు సంబంధించిన వ్యక్తా.? అతని పూర్తి వివరాలు కావాలని..వీటితో పాటు ఆ డ్రైవర్ జీత-భత్యాల గురించిన వివరాలు కావాలని చంద్రశేఖర్ ఆ దరఖాస్తులో కోరారు.ఇప్పుడు కమిషనర్ ఎలాంటి వివరాలు ఇస్తారో.? సరైన వివరాలు ఇస్తారో.? లేక ఇది కూడా ‘థర్డ్ పార్టీ’అనో.. ‘ఇవ్వకూడని’ వివరాలనో ఎప్పటిలాగే చేతులు దులుపుకుంటారో వేచిచూడాల్సిందే.!__________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News