నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం* మండలం కమ్మపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసిస్తున్న ముగ్గురు గిరిజన బాల,బాలికలకు ఉచిత సైకిళ్లను ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్ శ్రీ చినబాబు చేతుల మీదుగా రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి సౌజన్యంతో పంపిణీ చేశారు.ఈ సందర్బంగా చినబాబు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు నడిచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు గొప్ప సహాయంగా నిలుస్తాయని విద్య అందరికీ చేరేలా దాతలు చేస్తున్న సహకారం అభినందనీయమని, ఇలాంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ప్రతిరోజూ బడికి హాజరై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణం కావాలని సూచించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొంటూ, విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఉన్నత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.. చినబాబు ద్వారా అందిన ఈ సహాయానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శభాపతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





