*నేటి సాక్షి-మేడిపల్లి* భీమారం మండలం కమ్మరిపేట గ్రామానికి చెందిన కోటగిరి రాజేందర్ S/o నర్సయ్య 60 సంవత్సరాలు, కులం గౌడ, అనునతడు దాదాపు 15 సంవత్సరాల నుంచి నడుము నొప్పి కడుపు నొప్పితో బాధపడుతూ ఎన్ని సార్లు హాస్పిటల్ లో చికిత్స చేపించినా తగ్గకపోవడంతో, వారి ఆర్థిక ఇబ్బందుల వలన మళ్ళీ హాస్పిటల్ చూయించుకోలేకపోవడం వల్ల బాధపడుతూ, జీవితం పై విరక్తి చెంది తేదీ 26.02.2026 రోజున రాత్రి 9 గంటల నుండి 27.02.2026 రోజు ఉదయం 06.00 గంటల మధ్య లో తన గది లోని సీలింగ్ ఫ్యాన్ కు పాలీస్టర్ దోతి తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అని మృతుని భార్య కోటగిరి భారత ఫిర్యాదు మేరకు ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





