నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో ఇటీవల రెండో విడత సర్పంచి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మ కృష్ణ గౌడ్ విజయం సాధించారు కృష్ణ గౌడ్ 6 నెలల క్రితం మరణించగా అతని ఆశయం గ్రామ సర్పంచి కావాలనే కోరిక ఉండేది కానీ ఆ ఆశయం నెరవేరకుండా భగవంతుడు అతన్ని గ్రామ ప్రజల నుండి దూరం చేసినాడు ఆయన పోయిన సర్పంచి ఎన్నికలలో కమ్మెట గ్రామానికి ఉపసర్పంచిగా సేవలందించినాడు అట్టి మనిషిని గ్రామ ప్రజలు కూడా ఈసారి వచ్చే ఎలక్షన్లలో గ్రామ సర్పంచిగా పోటీ చేయాలని గ్రామ ప్రజల కోరిక కృష్ణ గౌడ్ గ్రామ ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉండేది ఇలాంటి సమయంలో ప్రజల నుండి దూరం అవ్వగా తండ్రి యొక్క ఆశయ సాధన కోసం కొడుకు శశిధర్ గౌడ్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో గ్రామంలో బీసీ జనరల్ రాగా తల్లి పద్మ కృష్ణ గౌడ్ ను బరిలో దింపినాడు ఇట్టి సమయంలో గ్రామ ప్రజలు పద్మ కృష్ణ గౌడ్ కు శశిధర్ గౌడ్ గ్రామ ప్రజలు యువకులు మహిళలు పెద్దలు చాలా మంచిగా సపోర్ట్ చేసి తనయుడు యొక్క మంచితనము తల్లి పద్మ కృష్ణ గౌడ్ ను విజయం వైపు నడిపించాయి ఈ యొక్క విజయాన్ని తండ్రి కీర్తిశేషులు కృష్ణ గౌడ్ కోరికను ప్రజల అండదండలతో అంకితం చేసినాడు ఈ విజయాన్ని గ్రామ ప్రజలకు యువకులకు మహిళలకు గ్రామ పెద్దలకు పేరుపేరునా పద్మ కృష్ణ గౌడ్ కొడుకు శశిధర్ గౌడ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపినాడ గ్రామ ప్రజలకు ఏ ఆపద వచ్చిన నేను మీ సేవకుడిలా పనిచేసేందుకు ఎప్పుడు ముందుంటాను గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు గ్రామ ప్రజల సహాయంతో ఎలాంటి కలమషం లేకుండా మీ ఇంటి మనిషిలా పనిచేస్తానని ఈ విజయాన్ని అందించిన గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు





