నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కమ్మెట గ్రామంలో బోగస్ ఓటర్లు చాలామంది ఉన్నారని గ్రామములో కాకుండా కమ్మేట చౌరస్తాలో వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారికి కమ్మెట గ్రామంలో ఓటు హక్కు కల్పించడం ద్వారా గ్రామ నాయకులకు పరాజయాలకు విజయాలకు వారు ముఖ్యంగా కావడంతో వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారికి వారి రాష్ట్రాలలోనూ ఓటు హక్కు ఉన్న మరి ఇక్కడ గ్రామంలో వచ్చి ఓటు హక్కు కల్పించుకోవడం విడ్డూరంగా ఉందని అట్టి బోగస్ ఓటర్లను కమ్మెట గ్రామ ఓటర్ లిస్టులో నుంచి 100 నుండి 150 మంది వరకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఓటర్లు ఉన్నారని గ్రామ యువకులు అంచనా వేసినారు అట్టి వారిని కమ్మెట గ్రామ ఓటర్ లిస్ట్ లో నుండి తొలగించాలని ఎంపిటిసి ఎలక్షన్లు వచ్చే లోపల మన కమ్మెట గ్రామ ప్రజలు యువకులు పెద్దలు ఆలోచన చేసి బోగస్ ఓటర్లను తొలగించాలని అధికారులకు విన్నవించాలని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు మన గ్రామాన్ని వేరే ఓటర్లు విజయాలకు పరాజయాలకు ముఖ్య కారణం కావద్దని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో అందరూ ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకుంటారని యువకులు అన్నారు





