Friday, March 13, 2026

కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఫోటో ఖాన్ బెల్ట్ గ్రేడింగ్ అవార్డ్ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ….

నేటి సాక్షి నారాయణపేట మార్చి 13,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ )నారాయణపేట జిల్లా లో ని మరికల్ రిషి స్కూల్లో శుక్రవారం విద్యార్థులు మరియు ధన్వాడ భారతి విద్యా నికేతన్ విద్యార్థులు వైట్ బెల్ట్ నుండి ఎల్లో బెల్ట్ 40 మంది విద్యార్థులు సాధించారు. గత మూడు నెలల నుండి ట్రైనింగ్ చేసి వైట్ బెల్ట్ నుండి ఎల్లో బెల్ట్ మరియు బ్రౌన్ బెల్ట్ సాధించారు. మాస్టర్ తాజుద్దీన్ కెఎఫ్ఎస్. తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ మరియు నారాయణపేట జిల్లా. కె ఎఫ్ ఎస్. డిస్టిక్ సెక్రెటరీ గౌని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు జరిగాయి ఇట్టి కార్యక్రమంలో మరికల్ గ్రామ జి . చెన్నయ్య, సూర్యచంద్ర ఫౌండేషన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మరికల్ ఎస్సై మహేశ్వరి గారి చేతుల మీదగా సర్టిఫికెట్స్ ఎల్లో బెల్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్ తాజుద్దీన్, గౌని శ్రీనివాస్ మాస్టర్ రిషి ప్రిన్సిపల్ సోజిస్ , హరీష్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పేరి రామకృష్ణారెడ్డి పోలమొని రామకృష్ణ మరికల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వార్డ్ నెంబర్ అశోక్ మరియు ఇన్స్ట్రక్టర్స్ హరికృష్ణ రవిచంద్ర వివేక్, మాసూమ్ బాబా, అబ్దుల్లా తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు ఎల్లో బెల్ట్ బ్రౌన్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News