మండల కో కన్వీనర్ పుల్లెల రాము
నేటి సాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
కరీంనగర్ జిల్లా: 11. సంవత్సరాల ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం గన్నేరువరం మండలకేంద్రంలో ప్రజలకు వివరించడం జరిగింది. మండల కో కన్వీనర్ పుల్లెల రాము మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎటువంటి ఎన్నికలు వచ్చిన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచి మోడీ కి అండగా నిలవాలని కోరారు.
కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మోడీ కారణమని గత 11 సంవత్సరాల అభివృద్ధి పథకాలే కరణంగానే మన కరీంనగర్ జిల్లా అభివృధి చెందింది అని కాబట్టి, బిజెపికి అండగా నిలవాలని కోరారు. మరియు భారతదేశం ఇంత శక్తివంతంగా ఎదగడానికి గల కారణం మోడీ పాత్ర గొప్పది. ఈరోజు ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా అవతరించింది అంటే దీనికి ముఖ్య కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాబట్టి వారికి మనం మద్దతుగా ఉండాలన్నారు. ఈకార్యక్రమం లో గన్నేరువరం మండల కో కన్వీనర్ పుల్లెల రాము, సీనియర్ నాయకులు కుర్ర హరీష్ ముదిరాజ్ యూత్ నాయకులు, గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.





