Sunday, March 1, 2026

కరెంటు మీటర్ రీడర్స్ విద్యుత్ యజమాన్యం 30 రోజుల పని దినం కల్పించాలి

నేటిసాక్షి, మిర్యాలగూడ : డివిజన్ విద్యుత్ మీటర్ రీడర్స్ పీస్ వర్కర్స్ యూనియన్ కార్మికులు వారి సమస్యల గురించి విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్, రాష్ట్ర నాయకులకు వారి సమస్యలపై శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకన్న, సీతారాములు మాట్లాడుతూ, రాష్ట్రంలో మీటర్ రీడర్స్ గా గత 15 సం. పై నుండి విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీసుకుంటూ లైన్మెన్ ల కింద పనులు చేసుకుంటూ ప్రాణాలు పణంగా పెట్టి స్తంభాలు ఎక్కి పూర్తి బాధ్యతతో పనులు చేస్తున్నారని, విద్యుత్తు యజమాన్యం వీరిని గుర్తించి, మీటర్ రీడింగ్ తోపాటు మిగతా 15 రోజులు 30 రోజులు పని దినాలు కల్పించాలని, వారి యొక్క కోరిక న్యాయమైనదని, మీటర్ రీడర్స్ వారు రెండవ తారీకు నుండి కరెంటు మీటర్ల రీడింగ్ లు తీయడం బందు చేస్తూ, హైదరాబాదులో ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు పాల్పడుతున్న కార్మికులకు వెంటనే విద్యుత్ శాఖ యజమాన్యం వారు వెంటనే మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులను పిలిపించి వారికి సంబంధించిన న్యాయపరమైన విధులను అప్పగించాలని, విద్యుత్ బిసి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో విద్యుత్ బిసి సంఘ నాయకులు కోచం మారయ్య, కోటేశ్వరరావు, విద్యుత్ శాఖ మీటర్ రీడర్స్ యూనియన్స్ నాయకులు మునీర్, శ్రీకాంత్, సైదా, అజయ్ నాయక్, మనసురాలి, కోటేష్, నాగార్జున, కరుణాకర్ రెడ్డి, శ్రీను, వినోద్ కుమార్, రాము, మహేష్, నాగరాజు, ప్రశాంతు, శశిధర్, మేష నాయక్, మల్లేష్, కొంపెల్లి సైదులు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News