Tuesday, January 20, 2026

కరెంట్ మీటర్ అడిగితే గిరిజన కుటుంబంపై అధికారుల–పోలీసుల దౌర్జన్యం!8 నెలలుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం శూన్యండిడి, చలాన్ కట్టించుకొని కూడా కరెంట్ ఇవ్వని ఏఈ హరీష్‌పై ఆరోపణలు‘లంబాడీ లంజకొడకా’ అంటూ గిరిజనుడిపై కులదూషణ — తీవ్ర విమర్శలుఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ స్టేషన్‌లోనే అవమానం‘బయటికి దెంగేయండి’అంటూ బెదిరించిన టౌన్ ఎస్సై సాకీర్వీడియో తీస్తున్న యువకుడి ఫోన్ గుంజుకున్న ఎస్సైపై ఆరోపణలుఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలంటూ అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా

నేటి సాక్షి మహబూబాబాద్భూక్యా రవినాయక్ ( డిసెంబర్ 31 ) మహబూబాద్ జిల్లాలో పోలీస్ అధికారుల దౌర్జన్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఫీజులు చెల్లించి, డిడి కట్టి, చలాన్ సమర్పించినా ఒక గిరిజన కుటుంబానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా అధికారులు–పోలీసులు కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది.గూగులోతు భీమా నాయక్ అనే గిరిజన వ్యక్తి తన కొత్త ఇంటికి కరెంట్ కనెక్షన్ కోసం గత 8 నెలలుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ప్రక్రియ ప్రకారం డిడి కట్టి, చలాన్ రూ.2800 చెల్లించినప్పటికీ కనెక్షన్ ఇవ్వలేదని ఆరోపించారు.⚡ ప్రకటనలు ఒకటి – క్షేత్రస్థాయి వాస్తవం మరోటి ⚡ప్రభుత్వం “ఉచిత విద్యుత్”, “సులభతర సేవలు” అంటూ ప్రకటనలు ఇస్తున్నా, వాస్తవంగా సామాన్యుడు ఒక కరెంట్ మీటర్ కోసం నెలల తరబడి తిరగాల్సి వస్తోందని బాధితులు విమర్శించారు. లంచం ఇవ్వకుండా పని జరగదన్న పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు.🚨 ఏఈ హరీష్‌పై లంచం డిమాండ్ ఆరోపణలు 🚨కరెంట్ మీటర్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలంటూ విద్యుత్ శాఖ ఏఈ హరీష్ డిమాండ్ చేసినట్టు భీమా నాయక్ తెలిపారు. దీనిని ప్రశ్నించినందుకు కులపరమైన దూషణలకు పాల్పడ్డారని, ఇది గిరిజనులపై స్పష్టమైన అవమానమని గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఒక ప్రభుత్వ అధికారి ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.👮‍♂️ పోలీస్ స్టేషన్‌లో మరో అవమానం 👮‍♂️విద్యుత్ అధికారుల వేధింపులపై ఫిర్యాదు చేయడానికి మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భీమా నాయక్ కుటుంబానికి అక్కడ మరో పరాభవం ఎదురైందని తెలిపారు. ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులే అసభ్య పదజాలంతో బెదిరించారని ఆరోపించారు.📱 వీడియో తీస్తే ఫోన్ గుంజుకున్నారన్న ఆరోపణలు 📱ఈ ఘటనను వీడియో తీస్తున్న భీమా నాయక్ కుమారుడు సూర్య ప్రకాశ్ గల్లా పట్టి నెట్టేసి, అతని సెల్ ఫోన్‌ను బలవంతంగా గుంజుకున్నారని టౌన్ ఎస్సై ఎస్‌కే సాకీర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇది సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నమని పలువురు అభిప్రాయపడుతున్నారు.✊ అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా ✊ఈ అన్యాయానికి నిరసనగా భీమా నాయక్ కుటుంబం, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడారు. తమకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.⚖️ ప్రధాన డిమాండ్లు ⚖️గిరిజనులను కులదూషణలు చేసి వేధించిన ఏఈ హరీష్, టౌన్ ఎస్సై సాకీర్‌లపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలిఅవినీతికి పాల్పడ్డ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలిబాధిత కుటుంబానికి తక్షణమే కరెంట్ కనెక్షన్ ఇచ్చి రక్షణ కల్పించాలిలేకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆమరణ దీక్ష చేపడతామని భీమా నాయక్ స్పష్టం చేశారు.❓ ప్రభుత్వానికే ప్రశ్న ❓ఒక గిరిజన కుటుంబం కరెంట్ కోసం 8 నెలలు తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?లంచాన్ని ప్రశ్నించినందుకు కులదూషణలు, పోలీస్ బెదిరింపులు ఎదురైతే సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుందని ధర్నాలో పాల్గొన్నవారు ప్రశ్నించారు.👥 పాల్గొన్న వారుఅడ్వకేట్ మోహన్ నాయక్, సూర్య ప్రకాశ్, స్వప్న బాయి, బాలు నాయక్, రమేష్ నాయక్, కెలోతు సాయి కుమార్, శ్రీకాంత్, కొప్పుల కిరణ్, జానీ, వీరన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News