Thursday, March 5, 2026

*కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి** చేపలు పట్టేందుకు వెళ్లి విషాదం*

నేటి సాక్షి – మెట్ పల్లి*మల్లాపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండే నరసింహులు (46), తండ్రి బుచయ్య, కులం చెంచు, వృత్తి నిమిత్తం వేంపేట గ్రామంలో నివసిస్తూ పశువులను కాచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది.*వాగుకు వెళ్లిన సమయంలో ప్రమాదం*సోమవారం సుమారు 7 గంటల సమయంలో చేపలు పట్టేందుకు వేంపేట గ్రామ శివారులోని వాగుకు నరసింహులు వెళ్లాడు. అక్కడ కరెంట్ వైర్ ఉపయోగించి చేపలు పట్టే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు అతడికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య దండే నర్సు (35) ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మెట్‌పల్లి పీఎస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News