Tuesday, March 10, 2026

కలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి వొళ్ళజీ సురేష్

నేటి సాక్షి నల్లబెల్లి ప్రతినిధి జనవరి 26 : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొమ్మరాజు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి వొళ్ళజీ సురేష్ జాతీయ జెండాను ఎగరవేశారు. భారత్ మాతాకీ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అధ్యక్షులు కొమ్మరాజు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి వొళ్ళజీ సురేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం వల్లే నేడు సామాన్యుడికి సైతం సమాన హక్కులు, రక్షణ దక్కుతున్నాయని కొనియాడారు.1950 జనవరి 26న మన దేశం పరిపూర్ణ గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ,ఎస్సై గోవర్ధన్, ఏపీఎం సుధాకర్, బొడిగె కిరణ్, పడ్డాల మురళి, జహంగీర్ పాషా, పాత్రికేయ మిత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News