Thursday, March 12, 2026

కలెక్టరేట్లో సిపిఆర్ పై అవగాహనా కార్యక్రమం

జగిత్యాల టౌన్ (నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)…(అక్టోబర్ 13):కార్డియో పల్మనరి రిసాసిటేషన్ (సిపిఆర్ )వారోత్సవాలు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు జరుగుతున్న సందర్భంగా స్థానిక సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్లో లో సోమవారం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మరియు జిల్లా అధికారులు, వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సిపిఅర్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. *ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ*కార్డియాక్ అరెస్ట్ వల్ల చాలా మంది యుక్త వయసులోనే మరణిస్తున్నారని అందరూ సిపిఅర్ పైన అవగాహన కలిగి ఉన్నట్లైతే కార్డియాక్ అరెస్టు వచ్చిన వారిని 10 పర్సెంట్ ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. *జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ* ఈ వారం రోజులు జిల్లాలో అన్నీ చోట్లా సి పి అర్ పైన విస్తృతమైన అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. డాక్టర్ లవ కుమార్, డాక్టర్ నరేశ్ మన్న క్వీన్స్ తో డెమో చేసి చూపించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ అందరీ చేత ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యం పట్ల మరియు తోటి వారి ఆరోగ్యం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు .ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లత, జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు బి.రాజా గౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, ట్రైని అదనపు కలెక్టర్ కే. హరిణి,జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేశ్, డి ఆర్ డి ఓ రఘువరన్ వివిధ జిల్లా అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News