Thursday, March 12, 2026

కలెక్టర్ కోసం పేట జిల్లా ప్రజల ఎదురుచూపులు….!? పాత కలెక్టర్ బదిలీ కొత్త కలెక్టర్ వచ్చి 15 రోజులు… ప్రజల అవసరాల కోసం కాళ్లు అరిగేలా కలెక్టర్ కార్యాలయానికి తిరుగుతున్న జిల్లా ప్రజలు…

నేటి సాక్షి, నారాయణపేట,మార్చు 12, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా గత నెల కలెక్టర్లను బదిలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.. అందులో భాగంగా పేట జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న పట్నాయక్ ను బదిలీ చేస్తూ ప్రాతిక్ జైనుల ను నారాయణపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇలా ఉండగా పదవి బాధ్యతలు చేపట్టి నూతన కలెక్టర్ ఇంతవరకు దాదాపు 15 రోజులు గడుస్తున్న కలెక్టర్ గారు అందుబాటులో లేరని ఇప్పటికీ జిల్లాలో అదనపు కలెక్టర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేట జిల్లా రైతులు సామాన్య ప్రజలు జిల్లాలో వాపోతున్నారు. ప్రతిరోజు మండలాల నుంచి గ్రామాల నుంచి కలెక్టర్ కోసం గ్రామాల ప్రజలు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. కనుక ప్రజల అవసరాలను అర్థం చేసుకొని నూతన కలెక్టర్ గారు అందుబాటులోకి రావాలని పేట జిల్లా ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా పలు మండలాల అధికారులు కూడా కలెక్టర్ కోసం ఎదురుచూస్తున్నట్లు చర్చించుకోవడం పేట జిల్లాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News