నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య ) 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి బి. సత్య ప్రసాద్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ మరియు జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. *గౌరవ వందనం*అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, జెడ్పి సి.ఈ.ఓ గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సి ఈ వో పి. నరేష్, కలెక్టరేట్ ఏవో షాదబ్ హకిమ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.






