నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆదివారం మానకొండూర్ ప్రజా భవన్ కార్యాలయంలో మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, పులి కృష్ణ, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు

