నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు అండగా అందజేస్తున్న కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను, మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పట్టణలోని ఎస్వీ గార్డెన్ లో 600 మంది లబ్ధిదారులకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి, మంగళవారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 600 మంది లబ్ధిదారులకు రూ.6 కోట్ల విలువ గల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం ఆర్ఎఫ్ చెక్కులము అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల తహశీల్దర్లు, ఎంపిడిఓ లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

