నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 11, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో షాదీ ముబారక్, లబ్ధిదారులకు పేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వా హయాంలోనే నిరుపేదలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలను గుర్తించి సంక్షేమ పథకాలను మంజూరు చేయడం జరుగుతుందని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా హౌసింగ్ శాఖ అధికారి శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామచంద్రయ్య, మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి, శేఖర్ రెడ్డి లక్ష్మయ్య గౌడ్, తన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి నరహరి, మండలాధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

