Sunday, January 18, 2026

కవ్వంపల్లి జన్మదినం.. వృద్ధాశ్రమంలో బియ్యం వితరణ

నేటి సాక్షి, చిన్నకోడూర్ : మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ 58వ జన్మదిన వేడుకలను సోమవారం బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలోని వృద్ధాశ్రయంలో బియ్యం వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవ్వంపెల్లి సత్యనారాయణ ప్రజల మనిషి, ఉదార సేవకుడన్నారు. మానవసేవే.. మాధవ సేవగా భావించిన వ్యక్తని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News