Saturday, March 14, 2026

*కష్టపడి కాదు…ఇష్టపడి చదవాలి.. చిక్కిరి శ్రీకాంత్* *పెద్దపులి నాగారం గ్రామంలో హై స్కూల్ లో సమస్యల పట్ల నాయకులు స్పందించాలి* *తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్* *

(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 23:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో… *టిఎస్ఎస్ఓ* తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యవస్థాపకులు లక్ష్మీ నివాస్ ఆదేశాల మేరకు.. ఉదయం ఫోన్ చేసి చెప్పిన వెంటనే స్పందించి హైస్కూల్లో ఉన్న సమస్యల పట్ల విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా.. మధ్యన భోజన పథకంలో ఎవరు భోజనం చేయడం లేదని తెలియడంతో.. పదవ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడగా.. అబ్బాయిలు కొంతమంది భోజనం చేసినప్పటికీ.. అమ్మాయిలు మాత్రం ఇంటి నుండి భోజనం తెచ్చుకోవడం పట్ల ఉన్న సమస్యను అడిగి తెలుసుకోవడం జరిగింది అబ్బాయిలు మాత్రం పేపర్ ప్లేట్స్ తెచ్చుకొని తింటునట్టుగా తెలియజేశారు అమ్మాయిలు ఏకంగా ఇంటి భోజనం తెచ్చుకొని తింటున్నట్టుగా చెప్పడంతో.. వెంటనే అక్కడ ఉన్న సమస్యల పైన.. ప్రధానోపాధ్యాయులైనటువంటి వెంకటయ్య గౌడ్ నీ అడగడంతో.. విద్యార్థినీ విద్యార్థులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినకుండా.. అబ్బాయిలు పేపర్ ప్లేట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది అమ్మాయిలు ఏకంగా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం జరుగుతుంది అని స్పష్టం చేయడం జరిగింది… ఆరవ తరగతి ఏడవ తరగతి విద్యార్థిని విద్యార్థులు చక్కగా భోజనం చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది చిక్కిరి శ్రీకాంత్ విద్యార్థులతో మాట్లాడుతూ.. పదవ తరగతి పిల్లలకు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని.. తెలియజేస్తూ.. ఐదు మంది అమ్మాయిలను ఐదు మంది అబ్బాయిలను స్టేజ్ పైకి పిలిపించి.. ఒక్కొక్కరు ఒక ఐదు మంది తో.. పేపర్ ప్లేట్స్ కాకుండా.. ప్లేటు మరియు గ్లాస్ తెచ్చుకొని స్కూల్లోనే భోజనం చేసే విధంగా కమిటీని వేయడం జరిగింది.. విద్యార్థులు వెంటనే స్పందించి.. రేపటి నుండే తక్షణమే ప్లేట్స్ గ్లాస్ లు ఇంటి నుంచి తెచ్చుకొని స్కూల్లోనే భోజనం చేస్తామని తెలియజేయడం జరిగింది.. అలాగే కమిటీ ఎవరైతే పది మంది ఉన్నారో.. వంటలను ఏ విధంగా వండుతున్నారు అనే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని.. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా.. మన స్కూల్ మనమే బాగుపరచుకోవాలని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు స్కూల్లో వంట చేస్తున్నటువంటి వాళ్లని సైతం భోజనం కరెక్ట్ గా మీరు చేసినట్లయితే పిల్లలు బయటనుంచి తెచ్చుకునే అవకాశం ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి సమస్యలు మళ్లీ తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థకి మళ్లీ ఇలాంటి కంప్లైంట్ వస్తే మాత్రం ఏకంగా.. రాష్ట్ర స్థాయి నుంచి టిఎస్ఎస్ఓ వ్యవస్థాపకులు లక్ష్మీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని హెచ్చరించడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News