నేటి సాక్షి మిర్యాలగూడ రూరల్:- కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని జప్తి వీరప్పగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుడిపాటి కోటయ్య అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జప్తి వీరప్పగూడెం నందు మంగళవారం పాఠశాల విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సహకారంతో ప్లేటు, వాటర్ బాటిల్, నోట్ పుస్తకాలు, పాఠశాలకు జాతీయ నాయకుల చిత్రపటాలను బహుకరించడం జరిగింది.ఈ సందర్భంగా హెచ్ఎం గుడిపాటి కోటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల బాగు కోసం కస్తూరి ఫౌండేషన్ గత పది సంవత్సరాలుగా కృషి చేస్తుంది అని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం విద్యార్థుల అవసరాలను దృష్టి యందుంచుకొని వారికి సహకరించడం అభినందనీయమని దాతల సహకారంతో విద్యార్థులు మంచి భవిష్యత్తును రూపొందించుకోవాలని, విద్యార్థులు దాతల సహకారంతో బాగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి మీరు చదివిన పాఠశాలకు ఎంతో కొంత సహకారం అందించాలని, అప్పుడే దాతల సేవలకు ప్రతిఫలం లభించినట్లు అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై.దామోదర్ రెడ్డి, పి.జగదీశ్వర్ రెడ్డి, వి.మాధవి, టి.శ్రీనివాసరెడ్డి, డి.జలరాం, యన్. చంద్రకళ, సీతారాములు, రవికుమార్, రేణుక తదితరులు పాల్గొన్నారు